APLRC ACT, 2024

THE ANDHRA PRADESH

LAND RIGHTS PROTECTION, TITLE

GUARANTEE AND CERTIFICATION ACT, 2024

In short

APLRC ACT, 2024

 

 

ప్రియమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా!

మీ స్థిరాస్తులు - ఇళ్ళు వాకిలి – కాపాడుకోవాలనుకుంటున్నారా?

అయితే ఇది చదవండి.

పతివాడ వెంకట గిరిధర్, న్యాయవాది-విశాఖపట్నం

 

ప్రతీ వ్యక్తి కొంత భూమిని కలిగి ఉండడం అత్యంత ముఖ్యమైన ఆర్ధిక స్వాతంత్య్రం మరియు ఆర్ధిక, సామాజిక స్థాయికి అత్యంత ప్రామాణికం.

ఒక వ్యక్తి యొక్క పరివిధములైనటువంటి స్థోమతకు కూడా భూమి కలిగి ఉండడం ప్రామాణికం.

పిల్లల పెళ్ళిళ్ళు దగ్గర నుండి విద్యాభ్యాసం వరకు ప్రతి విషయంలోనూ ప్రధమ స్థానంలో ఉంటుంది.

ప్రతి వ్యక్తి యొక్క జీవనం, జీవిన శైలి, జీవితం, జీవన ప్రమాణం, జీవనోపాధి, సామాజిక స్వాతంత్య్రం, సమానత్వం, సామాజిక గౌరవం, ప్రప్రధమంగా మరియు మూలంగా ఎంతో కొంత భూమి కలిగి ఉండడం పైనే ఆధారపడి ఉంటుంది. ఆదిగా భూ మండలంపై మానవునికి భూమి కలిగి ఉండడమే అతని స్థాయి యొక్క ప్రామాణికంగా నిర్దేశించబడుతుంది.

అంతటి అత్యంత ముఖ్యమైన వ్యవహారం పూర్తిగా నాశనమై అవినీతితో దిక్కులేకుండా పోయింది.

భూముల కొనుగోలులో మోసపోయి, కబ్జాలబారిన పడి ఎందరో ఆత్మహత్యలకు పాల్పడినవారు, రోడ్డున పడి దిక్కులేకుండా పోయినవారు, వ్యాపారములు పోగొట్టుకొని నిరు పేదలుగా మారిపోయినవారు, జీవిత ఆశయాలు నెరవేర్చుకోవడానికి కొన్న భూమి లేదని తెలిసి గుండె పగిలినవారు కోకొల్లలమంది ఉన్నారు.

ఎందరో అమాయకులు నేరస్థులుగా ముద్రపడి కోర్టుల చుట్టూ జీవితాంతం తిరుగుతూ, జైల్లలో మగ్గిపోతున్నారు.

సామాన్య పౌరులకే కాదు రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి, అంతర్జాతీయ పురోగతి కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

మరి భూమిని కొనాలంటే ఎవరిని సంప్రదించాలి? న్యాయవాది లీగల్ ఒపీనియన్ లేదా సలహా మేరకు కొన్న భూములు కూడా మోసపూరితమైనవని చివరికి తెలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను అడిగితే అన్నీ సరిగ్గా ఉన్నాయని రిజిస్ట్రేషన్ చేస్తారు. తీరా సదరు భూమి మోసపూరితమైనదని తెలిసి వారిని ప్రశ్నిస్తే స్టేంప్ డ్యూటీ మరియు ప్రభుత్వానికి రాబడి తప్ప మిగిలిన విషయాలకు తమ బాధ్యత లేదని, వారికి సంబంధం లేదని తేల్చి చెబుతూ కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇస్తారు.

మరి రెవెన్యూ, సర్వే & ల్యాండ్ రికార్డ్స్ శాఖలైతే అసలు వారి దగ్గర సమాచారమే లేదంటారు, వారి దగ్గర దస్త్రాలు లేవు అంటారు, కనీసం సదరు సమాచారం కానీ, దస్త్రాలు కానీ ఎక్కడ లభ్యమౌతాయో కూడా వారికి తెలియదు అంటారు. వేలకు వేలు డబ్బు ఖర్చు చేసినా కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కొంపలు ముంచుతున్నారు.

మరి భూమిని కొనాలంటే టైటిల్ మరియు హక్కులు భూమి అమ్మేవారికి పూర్తిగా ఉన్నాయా? అసలు స్థలం కొనాలంటే అది సరియైనదా కాదా? అని ఎవరు చెప్తారు? చెప్పిన వారు గ్యారెంటీ ఇస్తారా? ప్రభుత్వ అధికారుల వలన, ప్రభుత్వ శాఖల వలన, బాధ్యతారాహిత్యం వలన మరియు సంబంధిత రికార్డులు లేకపోవడం వలన భూమి కొనుగోలుదారుల జీవిత కాల కష్టార్జితం ఒక్క క్షణంలో నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?

భూములకు సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎందరు అధికారులు ఉన్నారు, ఏ ఆధికారి దేనికి బాధ్యుడు, అసలు భూములకు సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎటువంటి రికార్డులు ఉంటాయి. ఎలాంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందో  ఎవరికి తెలుసు?

చదువుకున్న వారికే ఇది పెద్ద చిక్కుముడి అయినప్పుడు, అసలు చదువులేనివారి సంగతి ఏమిటి?

ప్రజలారా!

మన దేశం, కనీసం మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు భూమి కొనుక్కునేటప్పుడు మరియు క్రయ విక్రయ, దాన మరియు ఇతరత్రా లావాదేవీలను దృవపరిచి, గ్యారెంటీతో కూడిన పత్రం జారీ చేయవలసిన బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం తక్షణమే ఏర్పాటు చేయవలసి ఉంది. సదరు సమస్యల పరిష్కారానికి సింగిల్ విండో విధానం మరియు అన్ని విధములైనటువంటి వ్యవహారములకు సంయుక్తంగా ఒకే కార్యాలయం జిల్లావారీగా ఏర్పాటు చేయాలి.

కొనుగోలు చేయవలసిన భూమి సరియైనదో, కాదో ప్రభుత్వమే దృవీకరించాలి.

No comments:

Post a Comment